రాజేశ్ మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు సాయం చేయండి.. కేంద్ర మంత్రి జైశంకర్ కు చంద్రబాబు లేఖ
- అమెరికాలోని ఫ్లోరిడాలో సముద్రంలో మునిగి చనిపోయిన రాజేశ్
- ఇద్దరు పిల్లలను కాపాడి నీటిలో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
- మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన మెరైన్ సిబ్బంది
ఏం జరిగిందంటే..
బాపట్ల జిల్లాకు చెందిన పొట్టి రాజేశ్ కుమార్ ఉద్యోగరీత్యా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బ్రిడ్స్ వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో వీకెండ్ సందర్భంగా శనివారం కుటుంబంతో సహా జాక్సన్ విల్ విట్లర్ బీచ్ కు వెళ్లారు. బీచ్ లో స్నానం చేస్తుండగా అలల తాకిడి పెరిగింది. దీంతో నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను రాజేశ్ కాపాడారు. అయితే, రాజేశ్ మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన మెరైన్ సిబ్బంది రాజేశ్ ను కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండా పోయింది. రాజేశ్ మృతదేహాన్ని వారు ఒడ్డుకు చేర్చారు.