శృంగారానికి సమ్మతి వయసు తగ్గించాలి.. కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్ట్ బెంచ్ సూచన
- సామాజిక పరిస్థితులు మారాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం
- తప్పిదం ఇద్దరిదైనా బాలురపైనే నేరారోపణలంటూ కామెంట్
- బాలికపై అత్యాచారం కేసు విచారణలో గ్వాలియర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు
ఈమేరకు ఓ బాలికపై పదేపదే అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడంటూ 2020లో దాఖలైన కేసును గ్వాలియర్ బెంచ్ కొట్టేసింది. విద్యాపరమైన శిక్షణకు వెళితే మత్తుపానీయం ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, దానిని కెమెరాలో రికార్డు చేసి బెదిరిస్తూ పలుమార్లు లొంగదీసుకున్నాడని బాలిక ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా ధర్మాసనం శృంగారానికి సమ్మతి వయసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతికి సవరణ చేయకముందు ఉమెన్ కన్సెంట్ ఏజ్ 16 ఏళ్లుగానే ఉండేదని ధర్మాసనం గుర్తుచేసింది.