తనయుడి ఫస్ట్ లుక్ చూసి భావోద్వేగాలకు గురైన గాయని సునీత
- రాఘవేంద్రరావు నిర్మాణ సారథ్యంలో సర్కారు నౌకరి
- గంగమోని శేఖర్ దర్శకత్వంలో చిత్రం
- హీరోగా పరిచయం అవుతున్న సింగర్ సునీత కుమారుడు ఆకాశ్
నటుడు కావాలని నువ్వు పడిన కష్టం, నీ కలను సాకారం చేసుకునేందుకు నువ్వు పడిన శ్రమ, సినిమా పట్ల నీకున్న నిబద్ధతకు, నటుడు అయ్యేందుకు నువ్వు చేసిన త్యాగాలకు ఈ ఫస్ట్ లుక్ అద్దం పడుతోంది అని సునీత పేర్కొన్నారు. ఒక తల్లి, కొడుకు కల నెరవేరిన రోజు ఇది... కంగ్రాట్స్ ఆకాశ్ అంటూ స్పందించారు.
ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను, సినిమా పట్ల నీ మమకారాన్ని త్వరలోనే అందరూ చూడనున్నారు... ఆల్ ది బెస్ట్ అంటూ సునీత కుమారుడికి ఆశీస్సులు అందించారు.