వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వార్డు మహిళా పోలీసు నిరసన
- మచిలీపట్టణంలోని 17వ వార్డు మహిళా పోలీసుగా పనిచేసిన లక్ష్మీప్రసన్న
- వైసీపీ నేతలు తనపై తప్పుడు కేసులు పెట్టించి ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణ
- ఉద్యోగంలోకి తిరిగి తీసుకున్నా విధులు చేయనీయడం లేదని ఆవేదన
ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వైసీపీలోని కీలక నేత కుమారుడు తన సమస్యను పరిష్కరించకుండా అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. తన పిల్లలకు ప్రాణహాని ఉండడంతో స్కూలుకు పంపలేకపోతున్నానంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.