తిరుమల శేషాచల అడవుల్లో అరుదైన సరీసృపం
- పలు అరుదైన జీవులకు ఆవాసంగా శేషాచల అడవులు
- తాజాగా ఫారెస్ట్ లిజార్డ్ గుర్తింపు
- పెద్ద పెద్ద కొండలు ఉండే చోట నివసించే అరుదైన జీవి
వీపుపై వెంకటేశ్వరస్వామి నామం వంటి గీతలు, వాటి మధ్యలో తిలకం దిద్దినట్టుగా మరో గీత, మిగతా భాగం నారింజ, నలుపు వర్ణాల్లో ఉంటుంది. మిగతా తొండలకు భిన్నంగా దీని చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. ఈ ఫారెస్ట్ లిజార్డ్ కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.