పండగల సమయంలోనే ఏమిటిది?: వివాదంగా మారిన రష్మీ ట్వీట్
- జంతుబలికి వ్యతిరేకంగా జబర్దస్త్ యాంకర్ ట్వీట్
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ గా క్రియేట్ చేసి అమ్ముతుంటే ప్రశ్నించడం లేదని ఓ నెటిజన్ ప్రశ్న
బక్రీద్ సందర్భంగా రష్మీ ఓ పోస్ట్ పెట్టింది. సాధారణంగా ప్రతి పండుగ సమయంలో ఆమె ఇలాంటి పోస్ట్‌లు పెడుతుంటుంది. జంతువులను హింసించి, బలిచ్చే ఆచారాలపై ఆమె మండిపడుతూ ఉంటుంది. తాజాగా గురువారం మరోసారి జంతుబలి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. అయితే రష్మీ ట్వీట్ పై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు ప్రతిసారి పండగల సమయంలోనే జంతువులపై ఎందుకు అంత ప్రేమ? పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ గా క్రియేట్ చేసి అమ్ముతున్నాయి.. వారిని ఎందుకు ప్రశ్నించవు? ఫేమస్ కావడం కోసం ఇలాంటివి చేస్తుంటారు... అంటూ పలువురు నెటిజన్లు ఆమె పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో వీధికుక్కల దాడిలో ఓ చిన్నారి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అందర్నీ కలిచి వేసింది. ఆ సమయంలో రష్మిక స్పందిస్తూ... కుక్కల తప్పు ఏమీ లేదు అన్నట్లుగా పోస్ట్ చేసింది. దీనిపై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.