నేరేడు పండు ప్రయోజనాల్లో మెండు.. తెలిస్తే వదిలిపెట్టరు!

30-06-2023 Fri 14:37 | Health
Advertisement
  • మధుమేహులకు మేలు చేసే పండు ఇది
  • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ లభ్యం
  • జీర్ణప్రక్రియ, గుండె పనితీరును పెంచుతుంది
Advertisement
వర్షాకాలంలో విరివిగా, చౌకగా లభించే పండ్లలో నేరేడు పండు ఒకటి. దీన్నే జామూన్ అని కూడా అంటారు. నల్లగా, నిగనిగలాడుతూ కనిపించే ఇవి రుచిలో అద్భుతంగా ఉంటాయి. రుచిలోనే కాదు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఏటా కనీసం ఓ రెండు నేరేడు పండ్లు అయినా తినాలని, దీనివల్ల కాలేయ శుద్ధి జరుగుతుందని పెద్దలు కూడా చెబుతుంటారు. అసలు నేరేడు పండ్లలో ప్రయోజనాలు గురించి తెలిస్తే వాటిని తినకుండా ఉండలేరు.

  • ఈ పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కనుక మధుమేహులతోపాటు అందరూ హ్యాపీగా తినేయవచ్చు. ఇవి మధురంగానే ఉన్నప్పటికీ రక్తంలోకి చక్కెరలు వెంటనే విడుదల కావు. నిదానంగా విడుదల అవ్వడం వల్ల బ్లడ్ షుగర్ పెరగదు. 
  • జామూన్ లో ఉండే జాంబోలిన్, ఎల్లాజిక్ యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివీని పెంచి బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తాయి. టైప్ 1తోపాటు, టైప్2 డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఇది మంచి పండు.
  • జామూన్ లో  యాంటీ ఆక్సిడెంట్లు అయిన యాంథోసియానిన్స్ ఉంటాయి. ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో ఇది సాయపడుతుంది. ఆక్సిడేటెవ్ స్ట్రెస్, ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది.
  • జామూన్ పాంక్రియాస్ ను స్టిమ్యులేట్ చేసి మరింత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. బ్లడ్ షుగర్ నియంత్రణకు ఇన్సులిన్ కీలకంగా పనిచేస్తుంది.
  • జామూన్ లోని బయో యాక్టివ్ కాంపౌండ్లు.. మధుమేహం కారణంగా తలెత్తే డయాబెటిక్ నెఫ్రోపతీ, డయాబెటిక్ రెటీనోపతి, న్యూరోపతి సమస్యల నియంత్రణకు సాయపడతాయి.
  • నేరేడు పండ్లలో జీర్ణప్రక్రియ సామర్థ్యాలను పెంచే గుణాలు ఉన్నాయి. కనుక జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారు దీన్ని తినాలి. 
  • వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ జామూన్ సాయపడుతుంది. ఎందుకుంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సీ కూడా లభిస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది.
  • జామూన్ లో కేలరీలు చాలా తక్కువ. కనుక బరువు పెరగరు. పైగా బరువు తగ్గించుకోవాలని అనుకునేవారికి ఇదొక ఆప్షన్. 
  • యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది.
Advertisement
Jamunfruithealthbenefitsneredu pandu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more