చిన్నారిని కదలకుండా చేసేందుకు ఇల్లాలి వెరైటీ ఐడియా
- రెండేళ్ల బాలుడిని అట్ట పెట్టెలో కూర్చోబెట్టిన ఇల్లాలు
- కదలకుండా ఉండేందుకు స్టిక్కర్ తో ప్యాకింగ్
- ఆ తర్వాత ట్రిమ్మర్ తీసుకుని నున్నగా షేవింగ్
బాక్స్ నుంచి బాలుడు బయటకు రాకుండా స్టిక్కర్ తో ప్యాక్ చేసింది. ట్రిమ్మర్ తీసుకుని తలంతా నున్నగా గుండు గీకేసింది. ఈ వీడియోని ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. చేతులు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో బాలుడు కదలకుండా కూర్చున్నాడు. దీంతో ఆ మహిళ వేగంగా తన పని పూర్తి చేసింది. ఆధునిక సమస్యకు, ఆధునిక పరిష్కారం అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.