Balakrishna: సుమకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం: బాలకృష్ణ సరదా వ్యాఖ్యలు

Balakrishna funny comments on Anchor Suma
షార్ట్స్‌లో చూడండి
జగపతిబాబు ప్రధాన పాత్రను పోషించిన ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని రసమయి బాలకిషన్ నిర్మించారు. మరోవైపు ఈవెంట్ లో బాలయ్య ప్రసంగిస్తూ ఫన్నీ కామెంట్లతో అలరించారు. యాంకర్ సుమను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. 

బాలయ్య మైక్ అందుకున్న వెంటనే అభిమానులు 'బాలయ్య సెక్సీ' అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దీంతో బాలయ్య మాట్లాడుతూ... సుమ, విమలారామన్, మమతా మోహన్ దాస్ వంటి వారు ఇక్కడ ఉండగా... బాలయ్య సెక్సీ అంటే వాళ్లంతా ఈర్ష్య పడతారని సరదాగా అన్నారు. వేదిక మీదకు తాను రాగానే అభిమానులను ఉద్దేశించి.. నేను చెప్పకుండానే చప్పట్లు కొడతారా అని సుమ అందనీ... ఈమెకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరమని నవ్వుతూ చెప్పారు. అయితే సుమతో జాగ్రత్తగా ఉండాలని... ఆమె చెప్పు దెబ్బలు కూడా కొడుతుందని ఫన్నీగా అన్నారు. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Balakrishna
Suma
Tollywood

More Telugu News