టీఎస్ ఐసెట్ ఫలితాల విడుదల.. టాప్ ర్యాంకర్ నూకల శరణ్ కుమార్

TS ICET results out
  • ఫలితాలను విడుదల చేసిన లింబాద్రి, తాటికొండ రమేశ్
  • తెలంగాణలో 16, ఏపీలో 4 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
  • పరీక్షకు హాజరైన 70,900 మంది విద్యార్థులు
తెలంగాణ ఐసెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, టీఎస్ఐసీఈటీ ఛైర్మన్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ వెంకటరమణలు కాకతీయ యూనివర్శిటీలో ఫలితాలను విడుదల చేశారు. నూకల శరణ్ కుమార్ తొలి ర్యాంక్ ను సాధించాడు. సాయి నవీన్, రవితేజలు రెండు, మూడు ర్యాంకులను సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను తెలంగాణలో 16, ఏపీలో 4 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 70,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 86.17 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారు. తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే సాధించడం గమనార్హం.
Go Back to Shorts
TS ICET
Results

More Telugu News