తిరుమల ఆలయంపై మరోసారి విమానాల కలకలం
- తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమశాస్త్రానికి వ్యతిరేకం
- ఇటీవల తరచుగా తిరుమల గగనతలంలోకి విమానాలు
- నేడు రెండు విమానాలు రాక
- ఆలయ పవిత్రతపై భక్తుల ఆందోళన
తాజాగా, మరోసారి ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు పొడిచేలా, రెండు విమానాలు తిరుమల గగనతలంలోకి ప్రవేశించాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించింది. మరో విమానం ఆలయ సమీపం నుంచి వెళ్లింది.
తిరుమల క్షేత్రంపైకి విమానాలు రాకూడని టీటీడీ చెబుతున్నా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. తాజా ఘటనలో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. తిరుమల కొండపైకి విమానాలు రావడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమేనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.