onu Sood: సెలేనా గోమెజ్ తో నా పెళ్లి జరిపించండి.. : సోనూ సూద్ ను కోరిన అభిమాని

Man seeks Sonu Soods help to marry Selena Gomez Actors reply is just next level
షార్ట్స్‌లో చూడండి
అభిమానులు అడిగే ప్రశ్నలు ఒక్కోసారి సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. ప్రముఖ నటుడు సోనూసూద్ ను ఓ అభిమాని సాధ్యం కాని పని చేసి పెట్టాలని కోరాడు. ఆరవ్ కే చౌదరి అనే యూజర్ ట్విట్టర్ లో సోనూసూద్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ‘‘సెలేనా గోమెజ్ సే మేరీ షాది కర్వా దో సర్’’అని ట్వీట్ చేశాడు. అంటే హాలీవుడ్ నటి, గాయని సెలెనాతో తనకు వివాహం జరిపించాలని కోరాడు. 

దీనికి సోనూసూద్ ఏ మాత్రం తగ్గకుండా రిప్లయ్ ఇచ్చారు. ‘‘చూడు అబ్బాయ్..  నీవు ఇప్పుడు నన్ను నటనను ఆపివేయించి ఓ మ్యారేజ్ బ్యూరోని తెరిపించేలా ఉన్నావు’’ అంటూ చమత్కారంగా బదులు ఇచ్చారు. ఈ సంభాషణను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మరోవైపు సోనూసూద్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ విక్రయిస్తున్న 18 ఏళ్ల ఓ బాలుడిని చూసి అతడితో మాట్లాడారు. మాట్లాడడమే కాదు, అతడి వద్ద మిగిలి ఉన్న అన్ని స్ట్రాబెర్రీ బాక్సులను కొనుగోలు చేసి తన వంతు సాయం అందించారు. 
Go Back to Shorts
onu Sood
Selena Gomez
seeks help
shaadi

More Telugu News