Jithender Reddy: వివాదాస్పద ట్వీట్‌పై వివరణ ఇచ్చిన జితేందర్‌‌రెడ్డి

తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌‌రెడ్డి చేసిన ట్వీట్‌ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు, కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన.. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.

ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో జితేందర్‌‌ రెడ్డి వివరణ ఇచ్చారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టానని ఆయన క్లారిటీ ఇచ్చారు. బిస్కెట్ల కోసం బరితెగించకండంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై విరుచుకుపడ్డారు.

‘‘కేసీఆర్ సోషల్ మీడియా ఊర కుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊర కుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అని జితేందర్‌‌ రెడ్డి పేర్కొన్నారు.
Jithender Reddy
BJP
Telangana BJP
Bandi Sanjay
KCR

More Telugu News