Pawan Kalyan: మెగా ఫ్యాన్స్‌కు అలర్ట్.. నేడే ‘బ్రో’ టీజర్

  • పవన్, సాయితేజ్ హీరోలుగా వస్తున్న ‘బ్రో’
  • సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి
  • జులై 28న విడుదల కానున్న చిత్రం
Bro Teaser to release Today evening

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం `బ్రో`. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. త‌మిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీత‌మ్ కు ఇది అధికారిక రీమేక్. పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని మాతృకలో పలు మార్పులు చేవారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌ల్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. 

ముఖ్యంగా ఓ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ ‘త‌మ్ముడు’లో వేసిన కూలీ గెట‌ప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సాయిధ‌ర‌మ్ కూడా ప‌వ‌న్‌ని అనుస‌రిస్తూ అదే గెట‌ప్ వేసుకొన్నాడు. ఈ చిత్రం నుంచి మెగా ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ రెడీ అయింది. చిత్రం టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సాయితేజ్ సూటు, బూటులో స్టయిల్ గా నడిచొస్తున్న మరో పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జులై 28న విడుదల కానున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News