ఒప్పో యాడ్ లో నటించిన రాజమౌళి... పూర్తి వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒప్పో యాడ్ లో నటించిన రాజమౌళి... పూర్తి వీడియో ఇదిగో!

Full video of Rajamouli Oppo ad
  • ఒప్పోతో రాజమౌళి ఒప్పందం
  • రెనో 10 సిరీస్ ఫోన్ కు ప్రచారకర్తగా రాజమౌళి
  • యాడ్ వీడియో పంచుకున్న జక్కన్న
హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు వాణిజ్య ప్రకటనల్లో నటించడం కామన్. కానీ దర్శకులు యాడ్స్ లో నటించడం చాలా అరుదు. అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి తాజాగా ఓ యాడ్ ఫిలింలో తళుక్కుమన్నారు. స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో కొత్త మోడల్ రెనో 10 సిరీస్ ఫోన్ కోసం రాజమౌళి యాడ్ లో నటించారు. 

తన సినిమాల్లో నటనకు సంబంధించి తారాగణానికి సూచనలు, సలహాలు ఇచ్చే జక్కన్న... ఒప్పో యాడ్ కోసం తానే నటుడి అవతారం ఎత్తారు. ఒప్పో రెనో 10 సిరీస్ ఫోన్ విషయానికొస్తే.. ఇది 64 ఎంపీ టెలిఫొటో పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తోంది. ఈ యాడ్ ఫిలిం వీడియోను రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఒప్పో లేటెస్ట్ ఫోన్ తో ప్రతి సీన్ సినిమాటిక్ అని వ్యాఖ్యానించారు.
Advertisement
Rajamouli
Oppo Ad
Reno 10 Series
Video

More Telugu News