500 వాహనాలతో భారీ ర్యాలీగా కాసేపట్లో మహారాష్ట్రకు కేసీఆర్.. 300 కి.మీ. పొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు
- మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్న కేసీఆర్
- రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న బీఆర్ఎస్ అధినేత
- పర్యటన అనంతరం ప్రత్యక విమానంలో హైదరాబాద్ కు తిరుగుపయనం
కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సమన్వయం చేసుకుని చేస్తున్నారు. ఏర్పాట్లను మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొంగ్డే, బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు. మహారాష్ట్ర పర్యటన అనంతరం ఉస్మానాబాద్ (దారాశివ్) విమనాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమవుతారు.
మరోవైపు మహారాష్ట్రకు వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారి పొడవునా భారీ ఎత్తున స్వాగత తోరణాలు, బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. కేసీఆర్ వెంటన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు మహారాష్ట్రకు వెళ్తున్నారు.