హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి దుర్మరణం
- కారును ఢీకొట్టిన టిప్పర్
- సంఘటన స్థలంలోనే మృతిచెందిన వ్యక్తులు
- మృతుల్లో ఇద్దరు మహిళలు
- మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తింపు
- సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్... కారును బలంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. డ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరణించినవారు వరంగల్ కాశీబుగ్గ సొసైటీకి చెందినవారిగా గుర్తించారు.