ముగిసిన కేటీఆర్ ఢిల్లీ పర్యటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన కేటీఆర్ ఢిల్లీ పర్యటన

KTR delhi tour concludes minister embarks on return journey
  • ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరిన మంత్రి కేటీఆర్
  • అంతకుమునుపు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్‌దీప్ సింగ్‌పురి, పీయూష్ గోయల్‌తో సమావేశం
  • రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చ, అభివృద్ధి పనులకు కేంద్ర సహకారం కోసం విజ్ఞప్తి
  • హోం మంత్రి అమిత్ షాతో ఖరారైన సమావేశం చివరి నిమిషంలో రద్దు
ఢిల్లీ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుమునుపు ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే అంశంపై రాజ్‌నాథ్ సింగ్‌తో కేటీఆర్ చర్చించారు. మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని, నగరంలో స్కైవేలు, ఫ్లైఓవర్‌లు నిర్మించేందుకు సహకరించాలని హర్‌దీప్‌సింగ్ పురీని కోరారు. ఇక హోం మంత్రి అమిత్ షాతో ఖరారైన సమావేశం చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే.
Advertisement
KT
Telangana
Amit Shah
New Delhi

More Telugu News