అలా చేస్తే జనం మమ్మల్ని తంతారు: తమ్మినేని సీతారాం
- శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం
- గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగని వైనాన్ని సభాపతి దృష్టికి తీసుకెళ్లిన సభ్యులు
- సకాలంలో పనులు పూర్తి చేయాలంటూ అధికారులకు సభాపతి ఆదేశాలు
ఈ క్రమంలో శాసనసభాపతి మాట్లాడుతూ..‘జల్‌జీవన్ మిషన్ పనుల్లో భాగంగా గ్రామాల్లో కుళాయిలు, పైపులైన్లు వేసి నీటి సరఫరా చేయాలి కానీ ఆ పనులు చేయట్లేదు. ఇలాగైతే రేపు ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు ఓట్లు అడగటానికి ఎలా వెళ్తాం? పనులు మధ్యలో ఆగిపోయి.. పూర్తిచేయకుండా ఓట్లు అడగడానికి వెళ్తే జనం మమ్మల్ని తంతారు. వాటిని సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి’ అని అధికారులను ఆదేశించారు.