Amazon: ప్రధాని మోదీతో సమావేశం అనంతరం భారత్ లో భారీ పెట్టుబడులు ప్రకటించిన అమెజాన్ సీఈవో

  • అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ
  • వాషింగ్టన్ లో అమెజాన్ సీఈవోతో మోదీ సమావేశం
  • భారత్ లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అమెజాన్ సిద్ధం
Amazon announces huge investments in India

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. వాషింగ్టన్ లో ప్రధాని మోదీతో సమావేశం అనంతరం, భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. 

రానున్న రోజుల్లో 15 బిలియన్ డాలర్ల మేర భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 11 బిలియన్ డాలర్లు భారత్ లో పెట్టుబడిగా పెట్టామని ఆండీ జెస్సీ వివరించారు. 

ఆండీ జెస్సీ ప్రకటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందబ్ బాగ్చి నిర్ధారించారు. అమెరికాలో ప్రధాని మోదీ, అమెజాన్ సీఈవో మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని, లాజిస్టిక్స్ రంగంలో భారీ పెట్టుబడులకు అమెజాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో, దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను డిజిటలైజ్ చేయాలన్న అమెజాన్ లక్ష్యాన్ని మోదీ స్వాగతించారని కూడా బాగ్చి వివరించారు.

More Telugu News