కర్ణాటకలో 30 శాతం ఐతే తెలంగాణలో 50 శాతం కమీషన్: ఠాక్రే
- బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందమన్న ఠాక్రే
- తెలంగాణలో బీజేపీతో వైరం అంటూ.. ఢిల్లీలో కలుస్తున్నారని ఆగ్రహం
- ఎమ్మెల్సీ కవితపై చర్యలేవని నిలదీసిన కాంగ్రెస్ ఇంచార్జ్
ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుంటే ఎమ్మెల్సీ కవితపై చర్యలేవన్నారు. కర్ణాటకలో ఇటీవలి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వానిది 30 శాతం కమీషన్ సర్కార్ అయితే, తెలంగాణలో ఏకంగా 50 శాతం కమీషన్ సర్కార్ నడుస్తోందన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.