Prasant Kumar Rout: విజిలెన్స్ దాడులకు భయపడి పొరుగింటి టెర్రస్ పై రూ.2 కోట్ల నగదు విసిరేసిన ప్రభుత్వ అధికారి

  • ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు అడిషనల్ సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్
  • ఆదాయానికి మించి భారీ ఆస్తులు ఉన్నట్టు గుర్తింపు
  • ఏక కాలంలో 9 చోట్ల దాడులు చేపట్టిన విజిలెన్స్ అధికారులు
Govt official throws Rs 2 crores onto neibhours terrace due to vigilance raids

ఒడిశాలోని నబరంగ్ పూర్ జిల్లాకు ప్రశాంత్ కుమార్ రౌత్ అదనపు సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కలిగివున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో భువనేశ్వర్ లోని ఆయన నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. 

దాంతో, ప్రశాంత్ కుమార్ రౌత్ రూ.2 కోట్ల నగదును పొరుగింటి టెర్రస్ పైకి విసిరేశాడు. ఈ విషయాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు పక్కింటి టెర్రస్ పైకి వెళ్లి 6 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నగదు కట్టలను గుర్తించారు. 

కాగా, ప్రశాంత్ కుమార్ రౌత్ అవినీతిపై ఉప్పందుకున్న విజిలెన్స్ విభాగం ఏకకాలంలో 9 చోట్ల దాడులు జరిపింది. భువనేశ్వర్ లోని నివాసంతో పాటు, నబరంగ్ పూర్ లోని మరో ఇంటిలోనూ, ఆఫీసులోనూ, భద్రక్ జిల్లాలోని తల్లిదండ్రుల నివాసంలోనూ, ప్రశాంత్ కుమార్ కు చెందిన మరో 5 ప్రదేశాల్లోనూ సోదాలు జరిపారు.

More Telugu News