చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినండి: పవన్ కు రోజా సలహా
- చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నారన్న రోజా
- పవన్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని వ్యాఖ్య
- అంతు చూస్తానంటూ జనసేన కార్యకర్తలకు వార్నింగ్
చంద్రబాబు స్క్రిప్ట్ ను చదుపుతూ పవన్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని చెప్పారు. అందరూ గుంపుగా రాకపోతే 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని పవన్ అన్నారని... గుంపుగా వచ్చినా, ఎవరికి వారు సింగిల్ గా వచ్చినా మళ్లీ జగనే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ జనసేన కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారని... మీ అంతు తేలుస్తానని హెచ్చరించారు. డెవిల్ ఈజ్ బ్యాక్ అని వార్నింగ్ ఇచ్చారు.