ప్రభుత్వం తప్పులను మీడియా వేలెత్తి చూపితే మార్గదర్శిని వేధిస్తారా?: కాంగ్రెస్ నేత
- మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం అత్యుత్సాహం, కక్ష సాధింపు అని వ్యాఖ్య
- మార్గదర్శిపై వారికి లేని సమస్య మీకెందుకని ప్రశ్న
- జగన్ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపణ
మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేదని, అయినా ప్రభుత్వానికి ఇంత అత్యుత్సాహం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఆవు, దూడ బాగా ఉన్నప్పటికీ, మధ్యలో గుంజకు వచ్చింది గురకరోగమని ఓ సామెత ఉందని, అలా ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లకు లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం తీరు వల్ల ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెంచవలసింది పోయి వివిధ సంస్థలను వేధిస్తూ.. వాటిని రాష్ట్రం నుండి వెళ్లగొట్టి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నాడన్నారు. రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు కూడా రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడటం సరికాదన్నారు.