పులిదాడిలో గాయపడిన గోవు.. పులిని తరిమికొట్టి రాత్రంతా దానికి రక్షణగా నిలిచిన మంద.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘటన
- ఒంటరిగా ఉన్న ఆవుపై పులి దాడి
- మంద వెళ్లడంతో పులి పరుగో పరుగు
ఆవుల మంద దాడిచేయడంతో పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిన పులి తిరిగి దాడిచేసేందుకు సమయం కోసం దాదాపు మూడు గంటలపాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. పులి దాడిలో గాయపడిన ఆవు చుట్టూ చేరిన మిగతా ఆవులు ఆ రాత్రంతా దానికి రక్షణగా నిలిచాయి. ఉదయం గాయపడిన ఆవును చూసిన యజమాని దానిని ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం దాని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 76 ఎకరాల్లో ఫామ్‌లో దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.