బక్రీద్‌కు ఆవులు, దూడలను కోస్తే ఊరుకోమంటూ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరిక
- డీజీపీకి లేఖ రాసిన బీజేపీ బహిష్కృత నేత
- సుప్రీం ఆదేశాల ప్రకారం ఆవులు, దూడలను కోయరాదని వెల్లడి
- ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తమ బృందాలు రంగంలోకి దిగుతాయన్న రాజా సింగ్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం చెక్ పోస్ట్ లను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే ఆవులు, దూడలను రక్షించుకునేందుకు తామే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నానని తెలిపారు. ‘మీరు చర్యలు తీసుకోకపోతే మా బృందాలు రంగంలోకి దిగుతాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.