పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడనంటూనే.. పూనంకౌర్, రేణు దేశాయ్ ల పేర్లను ప్రస్తావించిన ద్వారంపూడి
- పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేయాలని ద్వారంపూడి సవాల్
- పవన్ రెడ్డికుల ద్వేషి అంటూ విమర్శ
- చంద్రబాబు నుంచి పవన్ కు ప్రాణహాని ఉందని వ్యాఖ్య
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను అంటూనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూనంకౌర్, రేణు దేశాయ్ లు బయటకు వచ్చి మాట్లాడతాం అంటున్నారని... ఆయన పర్సనల్ లైఫ్ గురించి తాను కూడా మాట్లాడగలనని, కానీ మాట్లాడనని చెప్పారు. పవన్ డ్రగ్స్ వాడతారని ఇండస్ట్రీలో అనుకుంటుంటారని... అయితే ఈ విషయంలో తనకు క్లారిటీ లేదని, అందుకే దీని గురించి తాను మాట్లాడనని అన్నారు.
కాకినాడలో తనను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నీవు ఓడిపోతే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబును అడిగి వెంటనే టికెట్ ప్రకటించుకోవాలని, తాను జగన్ ను అడిగి టికెట్ తెప్పించుకుంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని అన్నారు.