Jagan: ఇండోనేషియన్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్... అభినందించిన సీఎం జగన్

CM Jagan appreciates Satwik and Chirag who wins Indonesian Open badminton doubles title
షార్ట్స్‌లో చూడండి
ఇండోనేషియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టీ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించారు. ఇవాళ జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట వరల్డ్ చాంపియన్ మలేషియా జోడీ ఆరోన్ చియా- సోహ్ వూయి యిక్ పై 21-17, 21-18తో అద్భుత విజయం సాధించారు. తద్వారా, ప్రతిష్ఠాత్మక ఇండోనేషియన్ ఓపెన్ లో తొలిసారి డబుల్స్ కిరీటం సాధించిన భారత ద్వయంగా వీరు రికార్డు పుటల్లోకెక్కారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ స్పందించారు. అద్వితీయ ప్రదర్శన కనబరిచి ఇండోనేషియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచారంటూ ఏపీ షట్లర్ సాత్విక్, చిరాగ్ జోడీని అభినందించారు. 

ఫైనల్లో వరల్డ్ చాంపియన్లను వరుస గేముల్లో ఓడించడం అయోఘం అని కొనియాడారు. సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తులోనూ మరిన్ని టోర్నమెంట్లలో చాంపియన్లుగా నిలవాలని సీఎం జగన్ అభిలషించారు.
Go Back to Shorts
Jagan
Satwik Sairaj Rankireddy
Chirag Shetty
Doubles Champions
Indonesian Open-2023

More Telugu News