లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి హత్య!
- పదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న కేరళ వ్యక్తి అరవింద్ శశికుమార్
- క్యాంబర్‌వెల్ ప్రాంతంలో మరో ముగ్గురు కేరళ వాసులతో అద్దె ఫ్లాట్‌లో నివాసం
- శుక్రవారం అరవింద్‌కు తన ఫ్లాట్‌లో ఉండే సల్మాన్‌తో తలెత్తిన వివాదం
- ఘర్షణ ముదరడంతో అరవింద్‌ను కత్తితో పొడిచేసిన సల్మాన్
- పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అరవింద్ మృతి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు అర్ధారాత్రి 1.30 గంటలకు ఘటనా స్థలికి చేరుకోగా, భవంతి మెట్ల వద్ద అరవింద్ మృతదేహం లభ్యమైంది. ఛాతిపై కత్తిపోట్ల కారణంగా అరవింద్ మృతి చెందినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు శనివారం నిందితుడు సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. అరవింద్, సల్మాన్ ఘర్షణను చూసిన మరో ఇద్దరు కేరళ వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే నగరంలోని భారత సంతతి యువతి గ్రేసీ ఓ మ్యాలీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వైద్య విద్య చదువుతున్న ఆమెను ఓ వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు.