అమెరికా, కెనడాలలోని భారత కాన్సులేట్ లపై దాడుల కేసుల దర్యాప్తు ఎన్ఐఏ చేతికి
- దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన ఖలిస్థాన్ అనుకూలురు
- అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ పై దాడి
- కెనడాలో దుశ్చర్య... లండన్ లో త్రివర్ణ పతాకానికి అగౌరవం
- తీవ్రంగా ఖండించిన భారత్... కేసు నమోదు చేసిన పోలీసులు
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయంపై దాడి విషయంలో ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారికి భారత్ అప్పుడే తీవ్ర నిరసన తెలిపింది. కెనడా హైకమిషనర్ ను కూడా పిలిపించి వివరణ కోరింది. అమెరికాలో దాడి జరిగిన రోజునే లండన్ లో కూడా భారత రాయబార కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచారు. దీనినీ భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశీ మంత్రిత్వ శాఖ నివేదికల ఆధారంగా హోంశాఖ ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ ఘటనపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ చేస్తోంది.