ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. థియేటర్ అద్దాలు పగలగొట్టిన అభిమానులు
- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన
- సౌండ్ సిస్టం సరిగా లేదంటూ గొడవ
- అద్దాలు పగలగొట్టి విధ్వంసం
- సినిమా ప్రదర్శన నిలిపివేత
సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో యాజమాన్యంతో గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యం వారికి సర్ది చెప్పి లోపలికి పంపింది. అయితే, సినిమా ప్రారంభమయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ మళ్లీ గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.