భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం... నాటు తుపాకితో భార్యపై కాల్పులు

  • జూలూరుపాడు మండలంలో ఘటన
  • భార్యతో గొడవపడి కాల్పులు
  • బాధితురాలి పరిస్థితి విషమం
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
నాటు తుపాకితో భార్యను కాల్చి పరారయ్యాడో భర్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. భోజ్యాతండా పంచాయతీ పరిధిలోని పుల్లుడు తండాకు చెందిన లావుడ్యా సామ-శాంతి భార్యాభర్తలు. గత రాత్రి భార్యతో గొడవ పడిన సామ నాటుతుపాకితో ఆమెపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న శాంతిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అటవీ జంతువులను వేటాడేందుకు ఉపయోగించే తుపాకితో నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న సామ కోసం గాలిస్తున్నారు. శాంతకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.

Bhadradri Kothagudem District
Crime News
Gun Fire

More Telugu News