Sensex: బలహీనంగా చైనా ఎకనామిక్ డేటా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 311 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 
  • 67 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • భారీగా నష్టపోయిన ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాకులు
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 62,917కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 18,688కి దిగజారింది. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, రియాల్టీ స్టాకులు ఎక్కువగా నష్టపోయాయి. చైనా ఎకనామిక్ డేటా బలహీనంగా రావడం మార్కెట్లపై ప్రభావం చూపింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
నెస్లే ఇండియా (1.12%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.01%), ఐటీసీ (0.76%), ఏసియన్ పెయింట్స్ (0.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.70%). 

టాప్ లూజర్స్:
విప్రో (-1.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.80%), కోటక్ బ్యాంక్ (-1.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.46%).

More Telugu News