అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

  • బిపర్ జాయ్ తుపాను కారణంగా పర్యటన రద్దు
  • షెడ్యూల్ ప్రకారం ఈ అర్ధరాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సిన అమిత్ షా
  • ఖమ్మం సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్న బండి సంజయ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను బిపర్ జాయ్ కారణంగా రేపు కేంద్ర హోం మంత్రి పర్యటనను రద్దు చేశారు. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో నిర్వహించే సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.  షెడ్యూల్ ప్రకారం ఈ అర్ధరాత్రికి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. రేపు ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది.  

ఈ తుపాను కారణంగా ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మోహరించాయి. రెస్క్యూ ఆపరేషన్స్ ను అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తారని బండి సంజయ్ తెలిపారు.

Amit Shah
Telangana
Tour
Postpone

More Telugu News