యూపీలో ఉన్నతాధికారి సమీక్ష సమావేశానికి షర్ట్ లేకుండా వచ్చిన ఉద్యోగి
- బనియన్ వేసుకుని హాజరైన ఆఫీసర్
- అసౌకర్యానికి గురైన తోటి ఉద్యోగులు
- సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఉన్నతాధికారులు
జిల్లాల వారీగా, విద్యా శాఖ చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై ఆయా జిల్లాల అధికారులతో డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి ఇతరుల మాదిరే ఓ అధికారి కూడా వచ్చి కూర్చున్నారు. తీరా చూస్తే వంటిపై షర్ట్ లేదు. బనియన్ మాత్రం వేసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల అధికారులు అసౌకర్యానికి గురయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఉన్నతాధికారులు ఈ చర్యను సీరియస్ గా పరిగణించారు. సదరు అధికారిని సస్పెండ్ చేశారు. దీనిపై విద్యా శాఖ విచారణ కూడా ప్రారంభించింది.