ఉచితంగా ఆధార్ అప్ డేట్... రేపటితో ముగియనున్న గడువు

Free update of AADHAR time line will end tomorrow
  • ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటున్న యూఐడీఏఐ
  • మార్చి 15 నుంచి ఉచితంగా అప్ డేట్ చేసుకునే సౌకర్యం
  • జూన్ 14 తుది గడువు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. ఈ క్రమంలో, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 15 నుంచి ఇది అమలులో ఉంది. అయితే ఈ ఫ్రీ అప్ డేట్ గడువు జూన్ 14తో ముగియనుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆధార్ అప్ డేట్ కోసం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 

https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సాయంతో ఆధార్ ను ఎవరైనా అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి.
Go Back to Shorts
AADHAR
Update
Free
UIDAI

More Telugu News