basara: బాసర ట్రిపుల్ ఐటీలో బాత్రూంలో చున్నీతో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య!

Basara Triple IT student commits suicide
షార్ట్స్‌లో చూడండి
బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న దీపిక ఏ3 బ్లాక్ లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన దీపికను భైంసా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది. 

దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్. ఆమె బాత్రూంకు వెళ్లి ఎంతకూ రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు.. సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్దలు కొట్టి చూసేసరికి చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. దీపిక మృతి పట్ల అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆత్మహత్యకు ముందు... ఉదయం 9 గంటల నుండి 12 వరకు ఆమె పరీక్షకు హాజరైంది. పరీక్షల్లో ముగ్గురు మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. వీరిలో దీపిక కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిబార్ చేస్తారన్న భయంతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
basara
iiit

More Telugu News