uber: ర్యాపిడో, ఉబర్‌లకు సుప్రీం కోర్టులో షాక్

  • టూవీలర్ సేవలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు
  • హైకోర్టుకు వెళ్లిన ర్యాపిడో, ఉబర్ సంస్థలు
  • సర్వీసులకు అనుమతించిన ఢిల్లీ హైకోర్టు
  • సుప్రీం కోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్ ప్రభుత్వం
  • ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
No two wheeler Rapido Uber bike taxi in Delhi as SC stays HC permit order

దేశ రాజధాని న్యూఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తోన్న ర్యాపిడో, ఉబర్ లకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. గతంలో ఈ సంస్థలు అందించే టూ వీలర్ సేవలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ర్యాపిడో, ఉబర్ సంస్థలు హైకోర్టుకు వెళ్లగా, ఈ సర్వీసులను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆ తర్వాత సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ర్యాపిడో, ఉబర్ లు మోటార్ వెహికిల్ యాక్ట్ 1988ను ఉల్లంఘిస్తున్నాయంటూ ఢిల్లీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో బైక్ - ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై తుది నిర్ణయాన్ని ప్రకటించే వరకు బైక్ - ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబర్ లు తమ సేవలను నిలిపివేయాలని తెలిపింది.

More Telugu News