నారా లోకేశ్ పై వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శలు
- వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించడానికే కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడన్న అవినాశ్
- ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాడని మండిపాటు
- రాయలసీమ బిడ్డ అనే విషయం లోకేశ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని ఎద్దేవా
తాను కూడా రాయలసీమ బిడ్డనే అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై అవినాశ్ స్పందిస్తూ... రాయలసీమవాసిననే విషయం లోకేశ్ కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప ఈ ప్రాంత బిడ్డననే విషయం గుర్తులేనట్టుందని అన్నారు. తండ్రీకొడుకులను రాయలసీమ ప్రజలే కాకుండా, రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు కూడా నమ్మరని వ్యాఖ్యానించారు.