హైదరాబాద్ లో నారాయణ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- నారాయణ కాలేజ్ క్యాంపస్ లో కలకలం
- హాస్టల్ బిల్డింగ్ పై నుంచి కిందపడడంతో దుర్మరణం
- వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరిన విద్యార్థిని
ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్ బిల్డింగ్ పైనుంచి కిందపడింది. ఐదు అంతస్తుల నుంచి పడడంతో తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే చనిపోయింది. అయితే, వంశిక ప్రమాదవశాత్తూ జారి పడిందా? లేక ఆత్మహత్య చేసుకుందా?.. మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలియరాలేదు. వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరిన విద్యార్థిని ఇంతలోనే విగతజీవిగా మారడంపై స్థానికులు, పేరెంట్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వంశిక మృతిపై అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.