BRS: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కేసీఆర్ సన్నిహితుడు.. కాంగ్రెస్ లో చేరే అవకాశం!

  • బీఆర్ఎస్ కు కూచాడి శ్రీహరిరావు రాజీనామా
  • బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తోందని విమర్శ
  • తెలంగాణను ఇచ్చింది సోనియాగాంధీనే అని వ్యాఖ్య
KCR ally Kuchadi Srihari Rao resigns BRS

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరి రావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17లోగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. 

2007లో శ్రీహరిరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా చురుకుగా వ్యవహరించిన ఆయన... కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అంతేకాదు, ఆదిలాబాద్ జిల్లా బహిరంగసభల్లో మాట్లాడినప్పుడల్లా శ్రీహరి రావుతో తనకు ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా శ్రీహరి వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విధులను నిర్వర్తించారు. 

తన రాజీనామా గురించి శ్రీహరి రావు మాట్లాడుతూ... రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. ఇలాంటి మోసాలు ఇష్టం లేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని... ప్రజలు ఆమెకే మద్దతు పలుకుతున్నారని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.

More Telugu News