ఆంధ్ర ఇక్కడికి 25 కిలో మీటర్ల దూరమే.. మరి ఏపీకి, తెలంగాణకు తేడా చూడండి: గద్వాల సభలో కేసీఆర్
- తెలంగాణ వస్తే చీకటిమయమవుతుందని మాట్లాడారన్న కేసీఆర్
- ప్రజల గురించి ఆలోచించని వారు ధరణిని తీసేస్తామంటున్నారని ఆగ్రహం
- మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువస్తే కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శ
ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించని వారు ఇప్పుడు ధరణిని తీసివేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కానీ ధరణి కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడుతోందని, పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయన్నారు. మూడేళ్లు కష్టపడి ధరణిని తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపించాలన్నారు.