Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో 'ఆర్జీవీ డెన్' .. కొత్త ఆఫీసు వీడియో మీరూ చూసేయండి!

RGV Special
Advertisement
  •  కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్న వర్మ
  • తన కార్యాలయాన్ని చూపిస్తూ వీడియో రిలీజ్ 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 
Advertisement
రామ్ గోపాల్ వర్మ ఏ పని చేసినా అందులో తన క్రియేటివిటీ ఉండేలా చూసుకుంటారు. తన మార్క్ చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఆయన స్వభావం .. ఆలోచనలు .. అభిప్రాయాలు .. అభిరుచులు డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన సినిమాలలో ఇవి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్న తన కొత్త ఆఫీసు కూడా తన అభిరుచికి అద్దం పట్టేలా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. 

సాధారణంగా ఎవరైనా ఎంత ముచ్చటపడి డిజైన్ చేయించుకున్నా, వచ్చినవారికి మాత్రమే దగ్గరుండి చూపిస్తుంటారు. కానీ వర్మ తన ఆఫీస్ లోని ప్రతి గదిని చూపిస్తూ ఏకంగా ఒక వీడియోను రూపొందించారు. ఒక పాటపై ఆ విజువల్స్ ను కట్ చేసి మరీ సోషల్ మీడియాలో వదిలారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది.

వర్మ తన ఆఫీసుకి 'ఆర్జీవీ డెన్' అనే పేరు పెట్టాడు. లోపల తిరుగుతూ ఉంటే .. అడవిలోని గుహల్లో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అలా మంచి గ్రీనరీ .. చక్కని లైటింగును ఆయన సెట్ చేశారు. తాను ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలు .. బోల్డ్ గా కనిపించే హీరోయిన్స్ పోస్టర్స్ .. సిట్టింగ్ ఏరియాలు .. ఇలా ఆ డెన్ లో చాలానే కనిపిస్తాయి. తన టేస్ట్ కి తగినట్టుగా వర్మ ఏర్పాటు చేసుకున్న ఈ ఆఫీస్ ను, వీడియో ద్వారా చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోవలసిందే.

Advertisement
Advertisement
Ramgopal Varma
Director
Tollywood

More Telugu News