ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు!
- జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు
- ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించిన శ్రేయస్ మీడియా సంస్థ అధినేత శ్రీనివాస్
- సొంత డబ్బులతో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటన
తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ఆదివారం ప్రకటించింది. తమ సొంత డబ్బులతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాతో పేర్కొన్నారు.