వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గుండెపోటుకు గురయ్యారు. ఈరోజు ఇంట్లో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పార్థసారథిని పరీక్షించిన వైద్యులు ఆయన గుండెపోటుకు గురయ్యారని నిర్ధారించారు. 

విజయవాడ అశోక్ నగర్ లోని టాప్ స్టార్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించిన వైద్యులు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పార్థసారథి గుండెపోటుకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.


More Telugu News