వెల్ కమ్ వదినా... అంటూ నీహారిక పోస్ట్

Niharika Konidela congratulates brother Varun Tej post engagement with Lavanya says been waiting for this day
  • లావణ్య త్రిపాఠిని కుటుంబంలోకి ఆహ్వానించిన నీహారిక
  • వారిద్దరితో కలసి ఉన్న ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్
  • ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో వేచి చూశానంటూ వ్యాఖ్య 
వదినమ్మకు ఆడపడుచు వెల్ కమ్ చెప్పింది. కొణిదెల నాగబాబు దంపతుల ఏకైక కుమారుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక అనంతరం వరుణ్ తేజ్ చెల్లెలు నీహారిక ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభినందనలు తెలియజేసింది. ‘‘ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. కుటుంబంలోకి స్వాగతం వదినా’’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసింది నీహారిక. 

తన పోస్ట్ తో పాటు నిశ్చితార్థ వేడుక ఫొటోను కూడా నీహారిక షేర్ చేసింది. అందులో అన్నయ్య, కాబోయే వదిన మధ్య నీహారిక నుంచుని ఉంది. అన్నయ్యను ఆటపట్టిస్తూ నవ్వుతున్న ఫొటోను కూడా పంచుకుంది. కాకపోతే నీహారిక భర్తతో కలసి ఉన్న ఫొటోను పంచుకోలేదు. ఈ వేడుకకు నాగబాబు అల్లుడు వచ్చాడా? లేదా అన్నది స్పష్టం కాలేదు. వీరి వైవాహిక బంధంలో స్పర్థలు అంటూ ఆ మధ్య వదంతులు రావడం తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్యకు ఎంతో మంది ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం ఉంటుందని తెలుస్తోంది. 
Go Back to Shorts
Niharika Konidela
congratulates
brother Varun Tej
Lavanya

More Telugu News