స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంతే చెప్పారు: కేటీఆర్ వ్యాఖ్య
- గతంలో రెడ్ టేప్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు రెట్ కార్పెట్ ప్రభుత్వం ఉందన్న కేటీఆర్
- నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకవచ్చునని విద్యార్థులకు సూచన
- తొమ్మిదేళ్లలో ఏం సాధించామో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందని కొంతమంది అడుగుతున్నారని, వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నామని, ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. మూడు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 9 లక్షలు దాటిందన్నారు. హైదరాబాద్ బాగా మారిపోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని గుర్తు చేశారు. కొత్త ప్రాంతాలకు వెళ్తే హైదరాబాద్ లో ఉన్నామా లేక న్యూయార్క్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, నిరంతర విద్యుత్.. ఇవన్నీ తొమ్మిదేళ్లలో సాధించామన్నారు.