'భోళాశంకర్' రిలీజ్ డేట్ వాయిదా?
- 'భోళా శంకర్'గా చిరంజీవి
- మాస్ కంటెంట్ తో రానున్న మెగాస్టార్
- ఆశించిన స్థాయిలో పూర్తికాని షూటింగ్
- రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని టాక్
ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఆ తేదీకి ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చని అంటున్నారు. సెకండాఫ్ కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు .. రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నారు. రిలీజ్ డేట్ లోగా వాటిని పూర్తిచేసే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పవన్ - సాయితేజ్ చేసిన 'బ్రో' సినిమా జులై 28న విడుదలవుతోంది. ఆ సినిమాకి కొంత గ్యాప్ ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా చిరంజీవి ఉన్నారని అంటున్నారు. అందువలన 'భోళా శంకర్' సినిమా విడుదల తేదీ వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేవరకూ వెయిట్ చేయవలసిందే.