అమెజాన్ ప్రైమ్ లో 'కస్టడీ' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెజాన్ ప్రైమ్ లో 'కస్టడీ' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..!

Custody Movie OTT streaming date confirmed
  • క్రితం నెల 12న విడుదలైన 'కస్టడీ'
  • తెలుగు .. తమిళ భాషల్లో ఆకట్టుకోలేకపోయిన సినిమా 
  • పోలీస్ పాత్రలో కనిపించిన నాగచైతన్య
  • ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' సినిమా రూపొందింది. టైటిల్ తోను .. పోస్టర్స్ తోను ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, ఇళయరాజా - యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం.

మే 12వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. అయితే కథాకథనాల పరంగా ఈ సినిమా ఈ రెండు భాషల్లోను ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమాను ఈ నెల 9వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు.

నిజాయతీ కలిగిన ఒక సాధారణ పోలీస్ .. ఒక భయంకరమైన నేరస్థుడిని ఎలా చట్టానికి అప్పగించాడనేది కథ. శరత్ కుమార్ .. అరవింద్ స్వామి .. ప్రియమణి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.
Advertisement
Nagachaitanya
Krithi Shetty
Sharathkumar
Aravind Swamy
Priyamani

More Telugu News