అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్ర?
- జులై 1 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- పాక్ కేంద్రంగా విధ్వంసాలకు పాల్పడే ఉగ్రవాదుల కుట్ర
- దాడికి ఇద్దరు కశ్మీరీ యువకులకు బాధ్యతల అప్పగింత
- అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ ఇద్దరి కోసం గాలింపు
రాజౌరీ - ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.